
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఏపీ (Joint AP)లో సీబీఐ(CBI) నమోదు చేసిన రెండు కేసుల్లో ఒక కేసు తుది తీర్పు నేడు వచ్చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(Obulapuram illegal mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) సహా మరో నలుగురు నిందితులకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court) ఏడేళ్ల జైలు, రూ.10 చొప్పున జరిమానా విధించింది. మరో ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 2009-2011 మధ్య ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసుతో మరో కేసు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే జగన్ అక్రమాస్తుల (Jagan’s disproportionate assets case)కేసు.
ఏదైనా సంచలనం నమోదు అవుతుందా..
సీబీఐ 2012లో వైసీపీ అధినేత జగన్(YS Jagan) మీద సీబీఐ, ఈడీ కేసులు ఫైల్ చేశాయి. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న దాని మీద పదకొండు ఛార్జి షీట్లు(Chargesheets) వేసి మరీ కేసు సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది. ఇప్పటికీ ఈ కేసుపై సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. గాలి కేసు ఒక కొలిక్కి వచ్చి తీర్పు వెలువరించిన తరుణంలో అందరి చూపు ఇప్పుడు జగన్ కేసు మీద పడింది. ఈ కేసు కూడా తొందరగా విచారణ ముగిసి సీబీఐ తుది తీర్పు ఇస్తుందని అంతా భావిస్తున్నారు. గాలి కేసులో తీర్పుని చూసిన వారు అంతా జగన్ కేసులో ఏదైనా సంచలనం నమోదు అవుతుందా అని కూడా చర్చించుకుంటున్నారు.