OMC: చంచల్‌గూడ జైలుకి గాలి జనార్దన్ రెడ్డి తరలింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) ఐదుగురిని దోషులుగా తేలుస్తూ ఈరోజు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇందులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి (A2), ఆయన పీఏ అలీఖాన్ (A7), వి.డి.రాజగోపాల్ (A3), శ్రీనివాస్ రెడ్డి (A1)ని అధికారులు చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కోర్టులోనే వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.

Image

 

కోర్టు ఆర్డర్ కాపీ లేటవడంతోనే ఆలస్యం

కాగా కోర్టు ఆర్డర్ కాపీ(Copy of court order) కోసం ఇప్పటి వరకూ వీరంతా కోర్టులోనే ఉండటం గమనార్హం. కోర్టు ఆర్డర్ కాపీ రావడంతో సీబీఐ కోర్ట్ నుంచి నేరుగా చంచలగూడ జైలుకు తరలించారు. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితులకు ఏడేళ్ల జైలుతోపాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Ex Minister Sabitha Indra Reddy), మాజీ IAS అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *