Cooli: రజనీకాంత్ ‘కూలీ’ మూవీకి కౌంట్‌డౌన్ షురూ

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajanikanth) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జైలర్ 2(Jailer2)’. మరొకటి ‘కూలీ(Cooli)’. మాస్ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ర‌జినీ స‌ర‌స‌న పూజా హెగ్డే(Pooja Hegde) ఐటమ్ సాంగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. భారీ బ‌డ్జెట్‌తో సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు..

ఇందులో నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra), శ్రుతి హాసన్‌(Shruthi Hasan) సహా పలువురు కీలక నటీనటులు కనిపించనున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ మేకర్స్ స్పెషల్‌ వీడియో(Special Video) షేర్ చేశారు. ఇప్పుడా వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పాన్-ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న కూలీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత…

Shiva Shakti Datta: టాలీవుడ్‌లో విషాదం.. ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తిదత్తా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) తండ్రి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శివ శక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *