ManaEnadu : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది. యూజర్ల సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఈ సంస్థ ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లు అందిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల స్పామ్ కాల్స్(WhatsApp Spam Calls)కు చెక్ పెట్టే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక తాజాగా వాట్సాప్‌లో షేర్ చేసే ఇమేజ్‌ల మూలాలు గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈజీగా ఇమేజ్ మూలం తెలుసుకోవచ్చు
వాట్సాప్‌లోని ఫొటోల కోసం మెసేజింగ్ యాప్ ‘‘Search on web’’ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ ఆప్షన్ సాయంతో వాట్సాప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా షేర్ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యమని ఈ సంస్థ తెలిపింది. మరి ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా?
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఇలా ఉపయోగించాలి
వాట్సాప్ చాట్‌లో ఇమేజ్‌ని ఓపెన్ చేసిన తర్వాత పైన కుడివైపున త్రీ డాట్స్ మెనూ క్లిక్ చేయాలి.
అక్కడ కనిపించే ఆప్షన్లలో‘‘Search on web’’ అనే దానిపై క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
అందులో ‘Search’ పై క్లిక్ చేస్తే రివర్స్ ఇమేజ్ సెర్చ్ షురూ అవుతుంది. ఇలా చేస్తే వెబ్ సెర్చ్ కోసం గూగుల్‌కు పంపే ఫొటోలు గోప్యంగా ఉంటాయని, వాబీటా ఇన్ఫో తెలిపింది.
ఫొటో ఎవరెవరు వాడారు?
ఇక ఇమేజ్ గురించి సెర్చ్ చేయగానే ఆ ఫొటో ఎక్కడినుంచి వచ్చింది, ఆన్‌లైన్‌లో ఈ ఫొటోను ఇంతకుముందు ఏ సందర్భాల్లో వాడారు వంటి సంగతులన్నీ కనిపిస్తాయి. ఆ ఫొటోను ఎడిట్ చేశారా, తప్పుదారి పట్టించేలా మార్చారా అనే విషయం కూడా తెలిసిపోతుంది. మొదటి బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.








