అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil), జైనాబ్(Zainab Ravdjee) ల పెళ్లి వేడుక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఈరోజు( శుక్రవారం జూన్ 6) తెల్లవారుజామున 3 గంటలకు గ్రాండ్‌గా జరిగింది. అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ రవడ్జీ(Zainab Ravdjee) మెడలో మూడుముళ్లు వేశాడు.
తెలుగు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా మూడు ముళ్ల బంధంతో ఈ పెళ్లి జరిగింది. అఖిల్, పట్టు వెస్టీ, శాల్వ ర్ తో సంప్రదాయంగా కనిపించగా, జైనబ్ లెహంగాలో మెరిసింది. వేదికపై వేద మంత్రాల మధ్య, బంధువుల ఆశీర్వాదాలతో పెళ్లి వీరి పూర్తయింది. ఈ ప్రత్యేక వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, హీరో శర్వానంద్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. అంతేకాకుండా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా పెళ్లికి విచ్చేసి సందడి చేసినట్టు సమాచారం.
ఇక దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు బరాత్‌లో పక్కా మాస్ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తం మీద ఈ పెళ్లిని చాలా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు. అయితే, జూన్ 8న సెలెబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నేతలు హాజరవుతారని తెలుస్తోంది. అఖిల్ అక్కినేని పెళ్లి అయిన తరువాత చాలా మందిలో జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
జైనబ్ ఎవరు?
జైనబ్ రవ్‌డ్జీ, ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె. ఆయన రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా విస్తృతంగా ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. జుల్ఫీ రవ్‌డ్జీకి ఇద్దరు సంతానం కాగా, కూతురు జైనబ్, కొడుకు జైన్. కొడుకు జైన్ రవ్‌డ్జీ జెడ్‌ఆర్ రెనేవేబుల్ ఎనర్జీ ప్రై.లి(ZR Renewable Energy Pvt. Ltd.) అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరి యూనిట్ పలు ప్రాంతాలలో ఉన్నాయట. ఇండియా వైడ్‌గా రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగానే సెటిల్ అయిందట
ఆస్తుల విషయంలో అఖిల్, జైనబ్ ఎంత రిచ్?
రవ్‌డ్జీ కుటుంబం వేల కోట్ల ఆస్తులపై హక్కు కలిగి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జైనబ్ తన తండ్రి ఆస్తుల్లో సగం వాటా పొందే అవకాశం ఉంది. ఇక అఖిల్ విషయానికి వస్తే, అక్కినేని వంశానికి చెందిన వారిగా ఆయనకూ భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునలు సినిమాల ద్వారానే కాదు, బిజినెస్ ద్వారానూ వందల కోట్ల సంపద కూడగట్టారు. ఈ సంపదలో అఖిల్‌కు వచ్చే వాటా కోట్లు చెరిపే స్థాయిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో, అఖిల్ అక్కినేని టాలీవుడ్‌లో అత్యంత సంపన్న హీరోలలో ఒకరిగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన అఖిల్‌కి సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






