తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యం, యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈయన గత చిత్రాలైన f2, సరిలేరు నీకెవ్వరూ, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలలో వినోదాన్ని పండించిన విధానం అందరికి తెలిసిందే. అనీల్ రావిపూడి రాసిన డైలాగ్ లు ఎప్పుడు హైలెట్ గా ఉంటాయి. ప్రస్తుతం అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాడు. ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని పారంభించారు. షైన్ స్క్రీన్స్ పతకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చిరంజీవికి జోడిగా ఇద్దరు హీరోయిన్ లు నటించనున్నారు. అయితే చిరంజీవికి జోడిగా మొదటి హీరోయిన్ గా నయనతారను ఇప్పటికే ఎంపిక చేశారు. అంతేకాదు, మరో కీలక పాత్రకు సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో, ఆ ఛాన్స్ ఎవరికి దక్కబోతుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పాత్ర కోసం మీనాక్షి చౌదరి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ఆమె చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించనుందనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవి అసలు పేరైన శంకర్ వరప్రసాద్ గా కనిపించనున్నాడు. చిరంజీవిని తన మార్క్ స్టైల్ లో కొత్తగా అలాగే వింటేజ్ టచ్ తో చూపించడానికి అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.






