
సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్స్ చిన్ననాటి ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఒక చిన్నారి తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పాప ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఇంతకీ ఆ పాప ఎవరు అనుకుంటున్నారా.. తండ్రి ఒడిలో ఉన్నఆ చిన్నారి.. ఎవరో ఇప్పుడు మనం చూదాం..
ఆ పాప ఎవరో కాదు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanatara). నయనతార అసలు పేరు డయానా, కురియన్. మలయాళంలో ‘మనసీనక్కరే’ సినిమా ద్వారా 2003లో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ‘అయ్యా’ ఆమె తొలి తమిళ చిత్రం కాగా, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.
View this post on Instagram
పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార, ‘లేడీ సూపర్ స్టార్’(Ledy Super Star) అనే బిరుదు పొందింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్‌తో నటించిన ‘జవాన్’ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. తొలి బాలీవుడ్ చిత్రంతోనే ఆమెకు అక్కడ మంచి పేరు దక్కింది.
నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 నుండి 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ రేంజ్‌లో కొనసాగుతోంది. 2011లో క్రిస్టియన్ మతాన్ని వదిలి హిందూ మతం స్వీకరించింది. 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్(vignesh Shivan)ను వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.