Formula E Race Case: KTR విచారణ టైంలోనే ఢిల్లీకి హరీశ్‌ రావు.. ఎందుకు?

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ సమయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఈ కేసు బాగా సీరియస్‌గా మారుతోంది. ఈ నేపథ్యలో, ED దర్యాప్తు మరింత లోతుగా జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. KTR మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఇవి పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని చెబుతున్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) కూడా ఈ కేసులో కలగజేసుకోలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈడీ విచారణలో మరింత దూకుడు పెంచింది.

విచారణ జరుగుతున్న సమయంలోనే ఎందుకు?

ఇదిలా ఉండగా ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే BRS కీలక నేత, మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ (Delhi)కి వెళ్లడం కొత్త చర్చలకు దారితీసింది. హరీశ్ రావు పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఆయన ఢిల్లీకి వెళ్లడాన్ని రాజకీయ పరోక్ష అర్థాలతో పరిశీలిస్తున్నారు. KTR విచారణ జరుగుతున్న సమయంలో హరీశ్ ఢిల్లీలో ఉండటం అనేకమంది రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. ఆయన ఢిల్లీ పర్యటన కేవలం అధికారిక పనులకు సంబంధించినదా లేదా అనే విషయం స్పష్టతకు రావాల్సి ఉంది.

హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఆరోపణలు

మరోవైపు హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్(Congress) శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ BJP పెద్దలతో మంతనాలు జరిపేందుకే ఆయన హస్తిన వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో KTRను సైడ్ చేసేందుకు కమలం నేతలను కలిసేందుకు వెళ్లారని అంటున్నారు. అయితే ఇక ఈ కేసు మలుపు ఎలా తిరుగుతుందన్న దానిపై అందరిలోనూ నెలకొంది. కేటీఆర్ విచారణ పూర్తయ్యాక ED మరిన్ని కీలక పరిణామాలను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, BRS మాత్రం ఈ విషయాన్ని ప్రజల ముందు సానుకూలంగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

Congress Archives - Centre for Public Policy Research (CPPR)

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *