
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. PSLV-C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO Scientists) మిషన్‌ను సమీక్షిస్తున్నారు. ఆదివారం (May 18) ఉదయం 5.59 గంటలకు మిషన్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Center) నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాం: ఇస్రో చైర్మన్
అయితే, ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్(Rocket)లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందన్నారు. అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్(ISRO Chairman Narayanan) చెప్పారు. ఇస్రోకు ఇది 101వ మిషన్. దీనిద్వారా తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం EOS-09 (రిసాట్-1B )ను PSLV-C61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం(The Satellite) బరువు 1,696.24KM. దీని జీవితకాలం ఐదేళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్(High Resolution)తో తీయనుంది.
Heartbreak for ISRO After 21 glorious successes, PSLV-C61’s failure stings deeply. The pride of our space journey faces a setback, but we know ISRO’s spirit will rise again. Two more missions await in 2025 🚀🇮🇳 #ISRO #PSLVC61 pic.twitter.com/ItoV7qSywG
— Abhinay Maths (@abhinaymaths) May 18, 2025