మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. ఇవాళ (ఏప్రిల్ 21) సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు(Wines Close) మూతపడనున్నాయి. అయితే ఇది కేవలం హైదరాబాద్ (Hyderabad) నగర పరిధి వరకు వర్తిస్తుంది. ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election) నేపథ్యంలో 4 రోజులపాటు నగరంలోని అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
కౌంటింగ్ రోజు కూడా..
MLC ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 23న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్(Counting) జరిగే 25వ తేదీ రోజున కూడా వైన్స్ మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో BJP తరపున గౌతమ్ రావు(Gautham Rao), MIM తరపున మీర్జా రియాజ్ ఉల్ హాసన్(Mirza Riyaz Ul Hassan) బరిలో ఉన్నారు.






