
సాధారణంగా మహిళలు, యువతులు, చిన్నారులపై పురుషులు అత్యాచారం(Rape) చేశారనే వార్తలు మనం తరచూ వింటుంటాం.. చదువుతుంటాం.. కానీ హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో సగటు మహిళాలోకం ముక్కున వేలువేసుకోక తప్పని పరిస్థితి. ఇంతకీ విషయమేంటంటే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్(Jubli Hills)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడి(Boy)పై 28 ఏళ్ల యువతి అత్యాచారానికి పాల్పడింది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. జరిగిందిదే.
వివరాల్లోకి వెళితే.. ఓ 28 ఏళ్ల యువతి తన ఇంటి పక్కే ఉండే బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. నిత్యం తన ఇంట్లోకి ఆ బాలుడిని పిలిచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. పైగా విషయం బయటకు తెలిస్తే తనపై దాడిచేశావని అందరికీ చెప్తానని బెదిరించింది. దీంతో బాలుడు భయపడి ఎవరికీ చెప్పలేదు. అయితే రానురాను వేధింపులు పెరగడంతో బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువతిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.