
పోరు ఏదైనా భారత్-పాకిస్థాన్(India-Pakistan)పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకుంటుంది. ఇక క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్(Cricket) విషయానికొస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends 2025) టోర్నీలో రేపు ఇరు జట్ల మధ్య సెమీఫైనల్(Semifinal) మ్యాచ్ జరగనుంది. నిన్న వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను చిత్తుచేసి ఇండియా ఛాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్స్ లెజెండ్ (WCL) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరాలంటే 14.1 ఓవరల్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 13.2 ఓవర్లలోనే గెలుపొందింది.
విండీస్‌పై విజయంతో సెమీస్‌కు
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 144 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో టీమిండియా(Team India) ఆటగాళ్లు స్టువర్ట్ బిన్నీ (50 నాటౌట్), శిఖర్ ధవన్ (25), యువరాజ్ సింగ్ (21 నాటౌట్), యూసుఫ్ పఠాన్ (21) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. లీగ్‌లో ఒకే మ్యాచ్ గెలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ఇండియా ఛాంపియన్స్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక, సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్ రేపు ఇంగ్లండ్(England)లోని ఎడ్జ్‌బాస్టన్‌లో సాయంత్రం 5 గంటలకు (IST) పాకిస్థాన్(Pakistan)తో తలపడాల్సి ఉంది.
లీగ్ మ్యాచ్ బాయ్‌కాట్ చేసిన భారత్
అయితే, ఇటీవల పహల్గామ్ ఉగ్ర ఘటన(Pahalgam terror incident) తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో లీగ్ దశలో ఓ మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు బాయ్‌కాట్ చేశారు. దీంతో టోర్నీ మేనేజ్‌మెంట్ పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింగ్ కేటాయించింది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌నూ ఇండియా ఛాంపియన్స్ బాయ్‌కాట్ చేస్తే పాక్ ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. దీంతో రేపు దాయాదితో భారత్ ఆడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
WCL : INDIA in to the Semifinals 🔥
They Chased 145 target in just 13.2 overs to Qualify in Semis.
Semifinal 1 : PAK vs IND
Semifinal 2 : SA vs AUS pic.twitter.com/gMZsRIPpd8— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) July 29, 2025