ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు అత్యంత వేగంగా వేసిన బంతి స్పీడ్ 161.3 (World Fastest Speed Ball) కిలోమీటర్లు. అది కూడా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోషబ్ అక్తర్ పేరు మీద ఉంది. కానీ కొన్ని క్రికెట్ మ్యాచులు జరిగే సమయంలో వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీం ఇండియా బౌలర్ సిరాజ్ వేసిన బంతి ఏకంగా 181.6 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు స్పీడ్ గన్ చూపించింది. కాగా ఇది టెక్నికల్ ఇష్యూతో జరిగినట్లు గుర్తించారు. బంతి అంత స్పీడ్ పడలేదని నిర్ధారించారు.
భువీకి ఇలాంటి అనుభవమే..
కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనే మరో భారత బౌలర్ విషయంలో జరిగింది. అతడే మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) ఓ మ్యాచులో వేసిన బంతి ఏకంగా 201. కిలోమీటర్లు అని మరో బంతి 208 మీటర్లు అని స్పీడ్ గన్ చూపించింది. ఐర్లాండ్ 2022లో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడా స్పీడ్ గన్ పొరపాటుగా 200 కిలోమీటర్లకు పైగా స్పీడ్ వేసినట్లు చూపించడంతో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు.
ఆడియన్స్ కు ఇక పండగే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అడిలైడ్ టెస్టులో (Adelaide Test)కూడా ఆసీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సిరాజ్ (Mohammed Siraj) ఆఫంప్ ఆవల వేసిన బంతిని లబుషేన్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ కొట్టాడు. ఆ వెంటనే ఆ బంతి వేగాన్ని స్పీడ్ గన్ 181.6 కిలోమీటర్లుగా లెక్కించినట్లు తెరపై కనిపించింది. గుర్తించిన అభిమానులు ఇక మీమ్స్ పండగ చేసుకుంటున్నారు. 2003 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో షోషబ్ అక్తర్ వేసిన బాల్ గంటకు 161.3 కిలో మీటర్లు. ఇదే ఇప్పటికీ అత్యుతమ వేగం కాగా.. అప్పుడప్పుడూ ఇలా ఫన్నీ సన్నివేశాలు జరుగుతుంటాయి. కాగా అడిలైట్ టెస్టులో భారత బౌలర్లను సహనానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే భారత్ స్కోరును అధిగమించిపోయారు. ట్రావిస్ హెడ్ (travis head) సెంచరీ చేసి క్రీజులో ఉండగా.. మార్నస్ లబుషేన్ 69 పరుగులు చేసి అవుటయ్యాడు.








