గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కొలనుకొండ వద్ద దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతంగా గొంతుకోసి హతమార్చారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక మహిళపై అత్యాచారం(Rape) చేసి హత్య(Murder) చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచడంతో హుటాహుటిన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న గుంటూరు SP సతీశ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్రంలో మహిళలపై రోజుకో అమానుష ఘటన: YCP
ఇదిలా ఉండగా ఈ ఘటనపై YCP స్పందించింది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. రెడ్ బుక్(Red Book) రాజ్యాంగంతో పాలనను గాలికి వదిలేసి ఇంకెంత మంది ఆడబిడ్డల మానప్రాణాలు తీస్తారంటూ మంత్రి లోకేశ్(Lokesh)ను ప్రశ్నించింది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దారుణం జరుగుతున్నా పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం కామెడీ స్కిట్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శించింది. ఈ ఘటనలో నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని హోమంత్రి అనిత(Home Minister Anitha)ను కోరింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కొలనుకొండ వద్ద మహిళ దారుణ హత్య
రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలనను గాలికి వదిలేసి ఇంకెంత మంది ఆడబిడ్డల మానప్రాణాలు తీస్తారు @naralokesh ?
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ వెనుక అత్యాచారం చేసి హత్య… pic.twitter.com/XvcN31K5fO
— YSR Congress Party (@YSRCParty) March 23, 2025








