
వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు మద్దతు ఇవ్వడంతో ఏపీలోని ముస్లింములను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని YCP విమర్శించింది. ముస్లింలు మీరు ద్రోహం చేశారని భావిస్తున్న తరుణంలో ఏం చేయాలో తెలియక మరో డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics)కు తెర లేపారని మండిపడింది. వక్ఫ్ భూములను కబ్జా చేసి హైదరాబాద్(HYD)లో సాక్షి ఆఫీసును YS జగన్ నిర్మించారంటూ TDP చేసిన ఆరోపణలపై వైసీపీ తాజాగా ఫైరయ్యింది.
ఈ మేరకు ‘‘మీ బతుకే కబ్జాల బతుకు. ఎన్టీఆర్ పెట్టుకున్న పార్టీని ఆయనకు వెన్నుపోటు పొడిచి లాగేసుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి జయప్రదంగా సైకిల్ గుర్తును, పార్టీ బ్యాంకు ఖాతాలను లాక్కున్నారు. హైదరాబాద్‌లో కట్టిన NTR ట్రస్ట్ భవన్ కోసం ప్రభుత్వ స్థలాన్ని లాక్కున్నారు. చివరకు మంగళగిరిలో కట్టిన పార్టీ ఆఫీసు కోసం వాగు పోరంబోకు భూమిని కబ్జాచేశారు. 2008లో సాక్షి మొదలయ్యింది. ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఏ ఒక్కరూ ఆ భవనం విషయమై వేలెత్తిచూపలేదు. మీ జీవితాల్లో అప్పుడప్పుడైనా నిజాలు చెప్పండి’’ అంటూ ఎక్స్ వేదికగా వైసీపీ విరుచుకుపడింది.
మీ బతుకే కబ్జాల బతుకు.
ఎన్టీఆర్ పెట్టుకున్న పార్టీని ఆయనకు వెన్నుపోటు పొడిచి లాగేసుకున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేసి జయప్రదంగా సైకిల్ గుర్తును, పార్టీ బ్యాంకు ఖాతాలను లాక్కున్నారు.
హైదరాబాద్‌లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కోసం ప్రభుత్వ స్థలాన్ని… https://t.co/mz0y8TreQ0 pic.twitter.com/ElTPVXQgEy— YSR Congress Party (@YSRCParty) April 3, 2025
కాగా ‘‘జగన్ లాంటోడు మేలు చేయకపోతే చేయకపోయాడు. కీడు చేయక పొతే చాలు అనుకుంటారు జనం. కానీ ముస్లింలకు అలా అనుకునే అవకాశం ఇవ్వలేదు. జగన్ వక్ఫ్ భూమిని కబ్జా చేసి అందులో సాక్షి ప్రధాన కార్యాలయం కట్టాడు’’ అని టీడీపీ ఇటీవల ట్విటర్‌లో ఆరోపించింది. దీనికి కౌంటర్‌గా వైసీపీ తాజా ట్వీట్ చేసింది.