Vijayasai Reddy: పాలిటిక్స్‌కు విజయసాయిరెడ్డి రాజీనామా

YSRCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పాలిటిక్స్‌(Politics)కు శుక్రవారం గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్(Tweet) చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వాని(Rajya Sabha Membership)కి రాజీనామా(Resignation) చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి తన ట్వీట్‌(X)లో తెలిపారు. CM చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)తోనూ చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఇకపై పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని చెప్పడంతోపాటు అవసరమైతే వ్యవసాయం(Farming) చేసుకుంటానని విజయసాయి రెడ్డి తెలిపారు.

గతంలోనే రాజీనామా వార్తలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ(Political survival) కష్టమౌతుందని భావించిన ఈ సీనియర్ నేత ఇకపై రాజకీయాల్లో యోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. YCP ఆవిర్భావానికి ముందు నుంచీ YS జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తోన్న ఆయన ఎక్కువ కాలం కొనసాగదలచుకోలేదని, ప్రత్యామ్నాయ దారులను వెదుక్కుంటోన్నారనే వార్తలూ గతంలో అనేకం వచ్చాయి. కాగా విజయసాయి తాజా నిర్ణయంతో మాజీ సీఎం జగన్(YS Jagan), వైసీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.

ఇదే బాటలో అయోధ్య రామిరెడ్డి?

మరో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా విజయసాయి బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతోంది. కాగా అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.

 

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *