పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : వైఎస్ జగన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ పై తీవ్ర కామెంట్లు చేశారు. పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ విమర్శించారు. పవన్‌ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా?

అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని వైఎస్ జగన్ (YS Jagan Press Meet) అన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. 175 మందిలో ఒకరికి ఇచ్చినట్టు టైమ్ ఇస్తామంటే ఎలా అని అడిగారు. సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్‌ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు(Chandrababu Naidu)కు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని.. ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారని జగన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు.

అది కూడా అమలు చేయలేదు

“నిరుద్యోగులకు రూ.3 వేల భృతి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Ride For Women).. తల్లికి వందనం.. ఉద్యోగ కల్పన.. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు.. ఏడాదికి ఒక్కక్కరికి మూడు సిలిండర్లు ఇస్తామని ఇలా వివిధ రకాల హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయింది. ఇప్పటికీ ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయడం లేదు. నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు రూ.36వేలు బాకీ పడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం చాలా చిన్నపథకం. అది కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది.” అని జగన్ విమర్శించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *