Zebra: జీబ్రా సినిమా 8 రోజుల కలెక్షన్​ ఎంతో తెలుసా?

యంగ్​ ట్యాలెంట్​ సత్యదేవ్ ((Satyadev) నటించిన జీబ్రా (Zebra) ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ అంత గొప్పగా ఏమీ లేదని, అలాగని తీసిపారేసే చిత్రం కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే సత్యదేవ్​తోపాటు సినీ బృందం బ్లాక్​బస్టర్​ అయ్యిందంటున్నారు. ఇటీవలే సక్సెస్​ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి సందీప్​ కిషన్​, శ్రీవిష్ణు, కిరణ్​ అబ్బవరం, ప్రియదర్శితోపాటు పలువురు యువ నటీనటులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే నవంబర్​ 22న విడుదలైన జీబ్రా మూవీ 8 రోజుల్లో రూ.9.45 కోట్లు వసూలు చేసిందని సత్యదేవ్​ సోషల్​ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ‘ఎక్స్​’లో ఓ పోస్టర్​ రిలీజ్​ చేశాడు. డే వన్ కంటే డే 8వ రోజు కలెక్షన్​ ఎక్కు వచ్చినట్లు పేర్కొన్నాడు. నార్మల్‌గా చూసుకుంటే ఈ కలెక్షన్​ చాలా తక్కువ. ఎంత బడ్జెట్​తో సినిమా తీశారు. ఇతర ఖర్చులు ఎంతయ్యాయి? ఇంకా రికవరీ చేయాల్సింది ఎంత? అన్నది చిత్రయూనిట్‌కే తెలియాలి.

సత్యదేవ్​ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘VD 12’ వర్కింగ్​ టైటిల్​తో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ కీ రోల్​ కోసం సత్యదేవ్​ను చిత్ర బృందం సంప్రదించిందని, ఇందుకు అతడు అంగీకరించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

డిఫరెంట్ కాన్సెప్ట్​తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. సత్యదేవ్​ రోల్ విజయ్ దేవరకొండకు హెల్ప్ చేస్తూనే వెన్నుపోటు పొడిచేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా భాగం అయినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అతడి పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్​గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *