గబ్బర్ సింగ్ (Gabbar Singh), మిరపకాయ్, దువ్వాడ జగన్నాధమ్, గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన హరీష్ శంకర్ (Harish Shankar) ఇటీవల మాస్ మహారాజ రవితేజతో మిస్టర్ బచ్చన్ తీసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat SIngh) తీస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రజాసేవలో బిజీగా ఉండటంతో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డేట్లు ఇవ్వడం కుదరడం లేదు.
హరీష్ కు మరో ఛాన్స్
ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు పక్కకి వెళ్లిపోయింది. ఇక మిస్టర్ బచ్చన్ (Mister Bachchan) ఫ్లాపుతో హరీష్ శంకర్ కు మరో ఛాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ స్టార్ హీరో హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆయనెవరో కాదు విక్టరీ వెంకటేష్. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఆ చిత్రం తర్వాత హిట్ ట్రాక్ ను అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఆచితూచి కథలు వింటున్నాడట. కాస్త లేటయినా ఫర్వాలేదు కానీ మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ సినిమా కథను సెలెక్ట్ చేశాడట.
హరీష్ తో వెంకీ సినిమా
శ్రీవిష్ణు ప్రధానపాత్రలో వచ్చిన సామజవరగమన (Samajavaragamana) సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పని చేసిన రచయితల్లో ఒకరైన నందు రాసిన కథ వెంకీ (Venkatesh)కి బాగా నచ్చిందట. అయితే నందుకు ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో ఈ కథను తీసుకుని దర్శకత్వం బాధ్యతలను హరీష్ శంకర్ కు అప్పగించాలని ప్లాన్ చేస్తున్నాడట. హరీష్ టేకింగ్ పై నమ్మకంతో ఈ చిత్రాన్ని అతడితో చేయాలనుకుంటున్నాడట. త్వరలోనే వీరి కాంబోలో సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.






