‘హరిహర వీరమల్లు’ హీరోయిన్ సీక్రెట్‌ మ్యారేజ్!

బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన ప్రియుడు, వ్యాపారవేత్త టోనీ బేగ్ (tony beig)​ను ఆమె పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమెరికా లాస్ ఏంజెలెస్​లోనీ ఓ స్టార్ హోటల్​లో గత వారాంతంలోనే వీరి వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైందట.

 

View this post on Instagram

 

A post shared by Nargis Fakhri (@nargisfakhri)

స్విట్జర్లాండ్ కు నర్గీస్-టోనీ

ఇక ఈ కొత్త జంట నేరుగా అమెరికా నుంచి స్విట్జర్లాండ్ వెళ్లినట్లు సమాచారం. ఈ ట్రిప్​నకు సంబంధించిన ఫొటోలు నర్గీస్ (Nargis Marriage) తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఈ జంటకు పెళ్లయిందని బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ జంట తమ వివాహం జరిగినట్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Nargis Fakhri Chills With Hubby Tony Beig In Switzerland, Drops First Picture After Wedding

హరిహర వీరమల్లులో ఛాన్స్

టోనీ బేగ్ కశ్మీర్​కు చెందిన ఓ బిజినెస్​మేన్. అతడి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. 2022 నుంచి నర్గీస్,  టోనీ డేటింగ్ లో ఉన్నట్లు ఈ బ్యూటీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక నర్గీస్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్ తో ఈ బ్యూటీ నటించిన రాక్ స్టార్ (Rockstar) ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ భామ తాజాగా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)లోనూ కనిపించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *