Pushpa 2 : ‘గంగో రేణుక తల్లి’.. జాతర సాంగ్ వీడియో వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప 2 : ది రూల్ (Pushpa 2 : The Rule). ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు హిందీలోనూ రికార్డులు బ్రేక్ చేసే వసూళ్లు రాబడుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక నట విశ్వరూపం చూపిన జాతర సీక్వెన్స్ గురించే ఇప్పుడు చర్చంతా.

గంగో రేణుక తల్లి

అయితే ఈ జాతర సీక్వెన్స్ సమయంలో ‘గంగో రేణుక తల్లి(Gango Renuka Thalli)’ అంటూ వచ్చే సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల కోసం మూవీ మేకర్స్ ఈ పాట వీడియోను రిలీజ్ చేశారు. రేణుకమ్మ జాతరలో అమ్మవారి అలంకరణలో బన్నీ చీర, నగలు, కాళ్లకు గజ్జెలు, కళ్లకు కాటుక, చేతికి గాజులు, చెవులకు కమ్మలు పెట్టుకుని చేసిన నృత్యం థియేటర్లో ప్రేక్షకుల చేత పూనకాలు తెప్పించింది.

మరో నేషనల్ అవార్డు పక్కా

మరోవైపు ఈ పాటతో, జాతర సీక్వెన్సులో ఆయన నటకు బన్నీకి మరో నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు నెటిజన్లు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. సుకుమార్ (Sukumar) సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక తాజాగా జాతర పాటను తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాంగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *