జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్ ఇక దాయాదిపై దయ చూపడం మానేయాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో దౌత్య సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ దేశ పౌరులను కూడా భారత్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
Union Minister for Home Affairs and Cooperation, Shri Amit Shah and Minister of External Affairs, Dr S Jaishankar called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/pk6XQFeHc5
— President of India (@rashtrapatibhvn) April 24, 2025
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత
ఈ ఘటనతో భారత్ సైనిక పరమైన చర్యలు తీసుకుంటుందని ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సంసిద్ధంగా ఉంది. కానీ ఊహించని రీతిలో భారత్ పాక్ ను సైలెంటుగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్‌తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty Tap) తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసింది.
రాష్ట్రపతితో కీలక భేటీ
ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ (President Murmu) ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు తెలిసింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ భేటీలో పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవడం చర్చించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.






