టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఆయన తన సినీ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Warm Welcome @anupamahere to our #Sharwa38 World 🤗
The Soul of Our Soil
Looking forward✨#CharmingStar38
Charming Star @ImSharwanand @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/Ui2tj6QuYu
— Sampath Nandi (@IamSampathNandi) April 26, 2025
శర్వా హీరోయిన్ వచ్చేసింది
తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శర్వానంద్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో అనుపమ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మేలో షూటింగ్ ప్రారంభం
ఇక ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. మే ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో భారీ సెట్ రెడీ చేశారు. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో (bheems ceciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు. శర్వానంద్, అనుపమ కలిసి గతంలో శతమానంభవతి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఈ జంట పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే మ్యాజిక్ ను ఈ చిత్రంలోనూ చూపిస్తారా చూడాల్సి ఉంది.






