Ap Inter Results: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Intermediate Results) విడుదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Education Minister Nara Lokesh) రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంత్సరాలకు కలిపి మొత్తం 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 70% మంది ఫస్ట్ ఇయర్, 83% మంది సెకండియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలలోనూ పాస్ పర్సెంటెజీ(Pass percentage) పెరిగిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ఏ జిల్లాది టాప్ ప్లేస్ అంటే..

ఇక ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికల(Girls)దే హవా కొనసాగింది. మొదటి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 71 శాతంగా ఉంటే బాలుర(Boys) ఉత్తీర్ణత.. 64 శాతంగా నమోదైంది. ఇక రెండవ సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 81 శాతంగా ఉంటే బాలుర ఉత్తీర్ణత.. 75 శాతంగా ఉంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 71 శాతంగా ఉంది.

BSEB 12th Sarkari Result Out 2024: Bihar Board 12th result link activated;  Result analysis | Board Results News - News9live

ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో కృష్ణా(Krishna) జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 82%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. 81%తో NTR జిల్లా మూడో ప్లేస్ సాధించగా.. 79%తో విశాఖ జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. 54% ఉత్తీరణత శాతంతో ఈసారి చిత్తూరు(Chittoor) జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా టాప్ లో ఉంది. 91%తో గుంటూరు జిల్లా సెకండ్ స్థానంలో ఉండగా…89%తో NTR జిల్లా 3వ స్థానంలో ఉంది. 73%తో అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్(Inter Supplementary Exams) మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 15-22 మధ్య ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్(Recounting, reverification) చేయించాలనుకునే వారు ఈనెల 13-22 మధ్య అప్లై చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *