
తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో భాగంగా సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని సీఎం గుర్తుచేశారు. పరిశ్రమ పురోభివృద్ధికి, ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం… pic.twitter.com/jehJbEgRq3
— Telangana CMO (@TelanganaCMO) December 26, 2024
పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , డీజీపీ జితేందర్, సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.సినీ పరిశ్రమ నుంచి సురేష్ బాబు, కేఎల్ నారాయణ, మురళీమోహన్, కే.రాఘవేందర్ రావు, కొరటాల శివ, వెంకటేశ్, నాగార్జున , అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.