నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా(Simha), లెజెండ్(Legend), అఖండ(Akhanda) సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో అఖండ సినిమా పాన్ ఇండియా(Pan india) రేంజ్‌లో ఈ కాంబోకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే ఈ సీక్వెల్ కాస్త ఆలస్యం అయింది. భగవంత్ కేసరి, డాకు మహారాజ్(Daaku Maharaj) సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో అఖండ 2 సినిమా సైతం ఆలస్యం అయిన విషయం తెల్సిందే.

అఘోరా పాత్రకోసం అనేక లుక్ టెస్టులు
బోయపాటి ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాడట. ముఖ్యంగా అఘోరాల గురించి చాలా విషయాలను తెలుసుకున్నాడట. అంతే కాకుండా బాలయ్యను అఘోరా(Aghora) పాత్రలో చూపించడం కోసం చాలా లుక్ టెస్ట్‌లు చేసి చివరకు ఈ లుక్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోరాగా కనిపించే పాత్ర. మొదటి పార్ట్‌లో అఘోర పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీపై ఇటీవల బోయపాటి వర్క్ విషయమై అసంతృప్తితో ఉన్నాడంటూ సోషల్ మీడియా(SM)లో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇంటర్వెల్‌కి ముందే ఆ సన్నివేశాలు
తాజా సమాచారం మేరకు ఏప్రిల్ మూడో వారంలో ఈ మూవీ యాక్షన్ సీన్స్(Action Scenes)ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్(Stunts choreographer Peter Haynes) ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ సన్నివేశాలు ఇంటర్వెల్‌కి ముందు వస్తాయట. ఈ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకు వెళ్లబోతున్నట్లు దర్శకుడు ఇంటర్వెల్ సమయంలో క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది.






