ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్.. బిగ్​బాస్ 2025 రద్దు

ఇండియన్ టీవీ హిస్టరీలో అన్ని భాషల్లో ఇప్పటి వరకు వచ్చిన రియాల్టీ షోలల్లో బిగ్ బాస్ (Bigg Boss) షోకు పాపులారిటీ ఎక్కువ. అత్యధికంగా వీక్షించిన షోగా ఈ షో నిలిచింది. ఇక ఈ రియాల్టీ షో వల్ల ఎంతో మంది నటీనటులు తమ కెరీర్ లో మరిన్ని అవకాశాలు సాధించారు. చాలా మంది పాపులర్ అయ్యి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందీ (Hindi), తెలుగు (Telugu), తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈ రియాల్టీ షో కొనసాగుతోంది.

Image

బిగ్​బాస్ 19 రద్దు

ముఖ్యంగా హిందీలో మొదటగా బిగ్​బాస్​ షో (Bigg Boss Hindi) ప్రారంభమైంది. 2006లో ఈ షో షురూ అయింది. అప్పటి నుంచి ఈ షోకు పాపులారిటీ బాగా వచ్చింది. హిందీలో ఇప్పటికే ఈ షో 18 సీజన్లు, ఓటీటీలో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇక త్వరలోనే 19వ సీజన్ ప్రారంభం కానుందని వార్తలు వచ్చిన వేళ బిగ్ బాస్ అభిమానులకు షాక్ ఇచ్చే ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో ఈ ఏడాది జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ ఏడాది బిగ్ బాస్ షోకు బ్రేక్ ఇచ్చినట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది.

Image

అదే కారణమా?

అయితే బిగ్ బాస్ రియాల్టీ షోను బానిజే ఆసియా (Banijay Asia), ఎండేమోల్ సంస్థలు (Endemol Shine India) ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థలతో కలర్స్ ఛానల్​కు విబేధాలు రావడం వల్లే ఈ ఏడాది బిగ్ బాస్ వాయిదా పడడానికి కారణమని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే కాకుండా మరో రియాల్టీ షో  ఖత్రోం కీ ఖిలాడీ (Khatron Ke Khiladi 2025) కూడా ఈ ఏడాది సీజన్ రద్దయ్యే ఛాన్స్ ఉందట. రెండు నెలల క్రితం చెలరేగిన ఈ వివాదం వల్ల ఈ రియాల్టీ షోల నుంచి ఆ రెండు సంస్థలు వైదొలగాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై కలర్స్ మీడియా, బనిజయ్ ఆసియా సంస్థలు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Image

రద్దు కాదు కేవలం వాయిదా

మరోవైపు ఈ కార్యక్రమాలు రద్దు కావని, కేవలం వాయిదా పడతాయని కొందరు అంటున్నారు. కలర్స్ ఛానెల్ (Colors) కొత్త నిర్మాతల కోసం వెతుకుతోందని త్వరలోనే కొత్త నిర్మాతలతో కొత్త సీజన్ ప్రారంభం అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఏడాది తప్పకుండా బిగ్ బాస్ సీజన్-19 (Bigg Boss 19 Hindi) ఉంటుందని చెబుతున్నారు. ఇక 18 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో మొదటి సీజన్ కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా సీజన్-2లో శిల్పాశెట్టి, మూడో సీజన్‌లో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 4 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్​గా కంటిన్యూ అవుతున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *