తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో(Retro)’. సమ్మర్ స్పెషల్‌గా మే 1న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బారజ్(Director Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్(posters), టీజర్(teaser), సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇక ఇప్పుడు ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీనిపై తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
Grand Audio and Trailer launch of #Retro on 18th April at Nehru Indoor Stadium, 5 PM onwards✨#TheOne#RetroFromMay1 #LoveLaughterWar pic.twitter.com/I67drCBDLw
— karthik subbaraj (@karthiksubbaraj) April 16, 2025
స్టైలిష్ లుక్‌లో సూర్య
‘రెట్రో’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియం(Nehru Stadium)లో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సూర్య తన స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను తొలుత అందరూ ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ అని అనుకున్నారు. కానీ, ఇదొక లవ్ స్టోరీ(Love Story) అని.. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండే ప్రేమకథ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2D ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జ్యోతిక(Jyothika), సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ చిత్ర ట్రైలర్(Trailer) ఎలా ఉంటుందో చూడాలి.






