DANA Cyclone: ‘దానా’ దూసుకొస్తోంది.. ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Mana Enadu: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం అతి తీవ్ర తుఫాను(Heavy Cyclone)గా మారింది. దీనికి దానా(DANA) తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక ఈ దానా తుఫానుతో వెస్ట్ బెంగాల్, ఒడిశా, APలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వె ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు(37 Trains Cancelled) చేసింది. పూర్తి వివరాలను ఈ కింది లీస్ట్ లో చూడొచ్చు.

 20-30 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం

వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ దానా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ(IMD) చెబుతోంది. అక్టోబర్ 23 నుంచి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. OCT 24 రాత్రి నుంచి OCT 25 ఉదయం వరకు 120KM వేగంతో వీస్తాయని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో 20-30CM వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఒడిశాలో ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

 ఏపీలో విస్తారంగా వానలు

ఈనెల 23,24వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని వాతావరణశాఖ (Meteorological Department ) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రేపటికి తుఫాన్‌గా బలపడనుందని వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఒడిశా, బెంగాల్ వద్ద తుఫాను తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది IMD పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *