Bhatti Vikramarka: తరచూ కరెంట్ పోతోందా? ఇకపై ఈ అంబులెన్స్‌లు వస్తాయ్

Mana Enadu: మనకు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్​ జరిగితే ఎమెర్జెన్సీ సేవల(emergency services) కోసం వెంటనే అంబులెన్స్‌లు వస్తుంటాయి. పశువులకు కూడా ప్రస్తుతం ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకపై మీకు మరో కొత్త అత్యవసర సేవ అందుబాటులోకి రానుంది. పైగా ఈ సేవలు దేశంలో మరెక్కడా కూడా లేవు. ఇంతకీ అదేంటంటే.. ఇకపై మీ ఇంట్లో పవర్​ కట్​ అయినా అంబులెన్స్‌లు(Electrical Emergency Vehicles) వస్తాయి. రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అంబులెన్స్ తరహాలో స్పెషల్​ వాహనాల​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 దేశంలో ఎక్కడా లేని విధంగా

గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే, ఎమెర్జెన్సీ విద్యుత్(electrical emergency) సేవల పునరుద్ధరణకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(TGSPDCL) ఆధ్వర్యంలో ద్వారా ‘విద్యుత్‌ అంబులెన్సు’లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. నెక్లెస్‌రోడ్డులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ వెహికల్స్​ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ ప్రత్యేక వాహనాలు(Special vehicles) ప్రారంభించామని భట్టి తెలిపారు.

టోల్​ఫ్రీ నంబర్ 1912

విద్యుత్‌ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు TollFree నంబర్ 1912కు ఫోన్‌ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఈ వాహనాల్లో వస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 57 డివిజన్‌లు(57 divisions) ఉండగా ప్రతి డివిజన్‌కు ఒక స్పెషల్​ వెహికల్(Special vehicles)​ను కేటాయించామన్నారు. అంబులెన్సులో ఒక అసిస్టెంట్‌ ఇంజినీరు, ముగ్గురు లైన్‌మెన్(assistant engineer and three line workers)లను అవసరమైన మరమ్మతు పరికరాలతో 24 గంటలూ రెడీగా ఉంటారని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఈ వాహనంలో తీసుకెళ్లగలరని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్