Mana Enadu: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Panindia star Prabhas)) ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ భారీ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ఇటీవలే Kalki 2898AD చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద న్యూ రికార్డ్స్ తిరగరాసింది. ప్రస్తుతం డార్లింగ్(Darling) చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన బర్త్ డే (OCT 23) సందర్భంగా ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్(Eeswar)’ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. బుధవారం ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
కొత్త ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్(Rerelease)ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రభాస్ సినిమాలు (సలార్, Mr.పర్‌ఫెక్ట్) రీరిలీజ్ అవ్వగా ఇప్పుడు 2002 నవంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ రీ రిలీజ్ కానుంది. ప్రభాస్ బర్త్ డే(Prabhas BirthDay) సందర్భంగా ఈశ్వర్ సినిమాని అక్టోబర్ 23న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల కొత్త ట్రైలర్(New Trailer)ని కూడా మేకర్స్ విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోయింది.
నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది
ప్రభాస్ కెరీర్ తొలి సినిమాగా వచ్చిన ఈశ్వర్‌ను డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ (Jayant C. Paranji)తెరకెక్కించారు. కె. అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్(RP Patnaik) స్వరాలు సమకుర్చారు. యాక్షన్ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా శ్రీదేవి విజయ్ కూమారి(Sridevi is VijayKumari)నటించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, శివ కృష్ణ, బిక్షు తదితరులు కీలక పాత్రలలో అలరించారు. ‘నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది’ అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి.