Mana Enadu: తెలంగాణ(Telangana)లో స్కూళ్లకు హాఫ్ డే(Halfdays for Schools) నిర్వహించనున్నారు. అదేంటి ఎప్పుడో ఎండాకాలంలో వచ్చే ఒక్కపూట బడులు ఇప్పుడేంటి అనుకుంటున్నారా? అవునండి మీరు చదివింది నిజమే. రాష్ట్రంలో November 6వ తేది నుంచి 30 వరకు స్కూళ్లు ఒక్కపూటే పనిచేయనున్నాయి. ఎందుకంటే తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కులగణన(Cast Census చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల(Govt Teachers)ను ఉపయోగించాలని డిసైడ్ అయ్యింది.
పొద్దున స్కూళ్లలో.. మధ్యాహ్నం సర్వేలో
ఇందుకోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT)ను, 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు(PSH), మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని ఉపయోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే సర్వే(Survey) పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు(Primary schools) ఒక్కపూటనే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి. తర్వాత కులగణనకు ఇంటింటికీ వెళ్లాల్సి ఉంటుంది.
కులగణనలో మొత్తం 75 ప్రశ్నలు?
ఇదిలా ఉండగా కులగణన కోసం అధికారులు మొత్తం 75 ప్రశ్నల(75 questions)ను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎవరైనా కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే భవిష్యత్తులో అనేక రకాలుగా తీవ్రంగా నష్టం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.






