జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(India, Pakistan War Crisis) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు ఆయుధాలకు పనిచెప్పాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మధ్య మరో వార్(War) తప్పదని అంతా భావించగా.. అనూహ్యంగా రెండు దేశాల మధ్య శాంతిచర్చలు(Peace talks) ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్(Ceasefire)కి అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల వెంబడి పరస్పర సైనిక చర్యల(military actions)ను నిలిపివేస్తూ ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఇరు దేశాల DGMOల మధ్య కుదిరిన ఒప్పందం
ఈ మేరకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి అధికారుల మధ్య అవగాహన కుదిరింది.
మే 10వ తేదీన ఇరు దేశాల DGMOల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ(Ceasefire) అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను (Confidence-Building Measures – CBMs) కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఇరుదేశాల అధికారులు భావిస్తున్నారు.






