టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర(Vishwambhara)’. ఈ సంక్రాంతి(Sankranthi) కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ చిరు తనయుడు రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ఉండటంతో పొంగల్ బరి నుంచి చిరు వెనక్కి తగ్గి చెర్రీకి లైన్ క్లియర్ చేశాడు మెగాస్టార్.. దీంతో ఈ మూవీ పెండింగ్ వర్క్స్ వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఓ రెండు పాటలు మినహా షూట్ అంతా పూర్తయింది. దీంతో కొన్ని రోజులుగా ‘విశ్వంభర’ రిలీజ్(Release) ఎప్పుడు? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
ఇప్పట్లో లేనట్లే..
ఈ నేపథ్యంలో చిరూ సినిమా మార్చి లేదా సమ్మర్ హాలిడేస్ సందర్భంగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ సినిమా వేసవిలో రిలీజ్ కాదని తెలుస్తోంది. చిత్రాన్ని ఆగస్టు(August)కి వాయిదా వేసినట్లు సమాచారం. ఆగస్టులో కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు(Chiru B’day) సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఫ్యాన్స్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేనా..?
ఆ రోజున రిలీజ్ చేస్తే మెగా అభిమానులకు కూడా ఓ ట్రీట్ లా ఉంటుందని చిరంజీవి అండ్ కో ఇలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చిరు నటించిన చాలా సినిమాలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ను కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చిరుతో సహా మేకర్స్(Makers) నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ చిరూ బర్త్ డేకు విశ్వంభరను సక్సెస్ చేసి గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. కాగా ఈ మూవీని బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లాడి(Vasisstha Malladi) తెరకెక్కిస్తుండగా.. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






