
తెలంగాణ రైతుల(Telangana Farmers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) నిధులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(Professor Jayashankar Agricultural University)లో జరిగిన రైతు నేస్తం(Rythu Nestam) కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతలకు డబ్బులు జమ చేశారు. 7 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం చెప్పారు.
Rythu Bharosa Funds released for this season by CM Revanth Reddy.
₹9,000 crore to farmers in 9 days under Rythu Bharosa. pic.twitter.com/TKgz9PtZa0
— Naveena (@TheNaveena) June 16, 2025
రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు
ఈ సందర్భంగా సీఎం రైతులతో ముచ్చటించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది తమ ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ వెల్లడించారు. సంక్షేమ పథకాల(Welfare schemes)పై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) గురించి కూడా CM చర్చించారు. జిల్లా నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు MLAలు పాల్గొన్నారు.
Telangana CM @revanth_anumula in రైతు నేస్తం
తొమ్మిది రోజుల్లో
9 వేల కోట్ల రూపాయలు…
70 లక్షల 11 వేల 984 మంది…
రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.ఇది “రైతు భరోసా”…
రాష్ట్ర రైతాంగానికి మీ సోదరుడి భరోసా. pic.twitter.com/JjYuYHTC0i— Sowmith Yakkati (@YakkatiSowmith) June 16, 2025