
రాజాసాబ్ ఓ ఎమోషన్ స్టోరీ అని, ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు సినిమాలు రాలేదని దర్శకుడు మారుతి (Maruthi) అన్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). హారర్ ఫాంటసీ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా కథ గురించి మారుతి తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇదొక ఎమోషనల్ స్టోరీ అని చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ స్క్రీన్స్‌పై ఇప్పటివరకూ రాలేదన్నారు.
కథకు అనుగుణంగా భారీ సెట్స్
‘‘రాజాసాబ్ ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఎన్నో భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. తాతయ్య, నానమ్మ, మనవడి కథను ఇందులో చూపించనున్నాం. స్క్రీన్‌పై చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు’ అని పేర్కొన్నారు. ప్రభాస్ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, కథకు అనుగుణంగా భారీ సెట్స్ ఏర్పాటుచేశామన్నారు. ప్రభాస్ సినిమాపై అంచనాలకు తగ్గట్టుగా వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై దృష్టిపెట్టామని, అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనుకాడలేదన్నారు. సినిమా కోసం ప్రభాస్ ఎంతో శ్రమించారన్నారని తెలిపారు.
డిసెంబర్ 5న పాన్ఇండియా స్థాయిలో రిలీజ్
నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న రాజాసాబ్‌లో సంజయ్‌దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 5న పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 3 గంటల నిడివితో ఇది విడుదల కానుందని టీజర్ రిలీజ్ ఈవెంట్లో మారుతి తెలిపారు.