నేచురల్ స్టార్ నాని (Nani) తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా లో రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ (Court)’. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబడుతోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి (Priyadarshi), శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇక ఈ మువీలో శివాజీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయన తెరపై విశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Watched Court movie yesterday. This film made with extraditiory screen play. Ram Jagadeesh made a assured debut. I really appreciate Prashanthi and Nani. They took a bold step as a producers to take this movie. Everybody in the movie acted so well especially Shivaji gave his bes. pic.twitter.com/WmXb6wPhHe
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 15, 2025
స్క్రీన్ ప్లే అదిరింది
తాజాగా కోర్ట్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) వీక్షించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్టు పెట్టారు. ‘‘కోర్ట్ సినిమా చూశాను. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చాలా చక్కగా తీశారు. దర్శకుడు రామ్ జగదీశ్ (Ram Jagadish Court) మంచి కథతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సినిమాను నిర్మించిన నాని, ప్రశాంతిని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. సినిమాలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా శివాజీ (Shivaji) నటన ఉత్తమంగా ఉంది’’ అని రాఘవేంద్ర రావు అన్నారు.
#CourtStatevsANobody is a very well made court-room drama and a very honest attempt by the team.
Neatly written & executed by director #RamJagadeesh and beautifully performed by all the actors.
My regards to @nameisnani for always backing such content.
Big congratulations to…
— Ravi Teja (@RaviTeja_offl) March 14, 2025
నానికి నా అభినందనలు
కోర్ట్ మూవీ చూసిన మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఈ కోర్ట్ రూమ్ డ్రామాను చక్కగా తీర్చిదిద్దారు. అన్ని విషయాల్లో టీమ్ చాలా బాగా పని చేసింది. రామ్ జగదీశ్ కథ, స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇక నటీనటులంతా అదరగొట్టారు. ఇలాంటి కథకు నిర్మాతగా వ్యవహరించిన నానికి నా అభినందనలు’’ అంటూ రవితేజ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.






