
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో ప్రస్తుతం SSMB29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశాలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తొలిరోజే సెట్ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో జక్కన్న అలర్ట్ అయ్యాడు. ఇక నుంచి SSMB29కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, న్యూస్ లీక్ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. అయితే ఒడిశా షెడ్యూల్ లో జక్కన్న.. మహేశ్-పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ల మధ్య సీన్స్ షూట్ చేస్తున్నట్లు లీకైన వీడియోలు చూస్తే తెలిసిపోతోంది.
View this post on Instagram
SSMB29 ఫొటో లీక్
అయితే ఇదే షెడ్యూల్ షూటింగులో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కూడా పాల్గొంది. ఇందుకోసం ఇటీవలే ఆమె లాస్ ఏంజెలెస్ నుంచి ఒడిశా చేరుకుంది. SSMB29 టీమ్ తో కలిసి షూటింగులో పాల్గొంటోంది. అయితే మార్చి 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా ప్రియాంకా SSMB29 బృందంతో కలిసి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంది. పండుగ పూట కూడా షూటింగులో పాల్గొన్నట్టు తెలిపిన పీసీ.. హోలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఏడాది ఇది వర్కింగ్ హోలీ అంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.
ప్రియాంకా పోస్టు.. నమ్రత రిప్లై
అయితే ప్రియాంకా చోప్రా పెట్టిన పోస్టుతో ఈ ఫొటోలు SSMB29 షూటింగ్ సెట్ లోనివే అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ప్రియాంకా పోస్టుకు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namratha Shirodkar) రిప్లై ఇవ్వడంతో అది పక్కాగా SSMB29 సెట్ లో దిగిన ఫొటోనే అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి మరింత మంది హాలీవుడ్ స్టార్లను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.