
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే వ్యాఖ్యలే కాదు.. తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయ్ మరి. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుని దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు ట్రంప్. ఓ 13 ఏళ్ల బాలుడి(Children)ని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్(US Secret Service Agent)గా నియమించారు. తన ఎదుటే అధికారిక బ్యాడ్జీ(Badge) అందజేయాలని చెప్పగా.. అధికారులు ఆ పని చేశారు. ఆపై బాలుడు యూనిఫామ్ వేసుకుని మరీ.. అధికార బాధ్యతలు చేపట్టాడు. మరి ట్రంప్ ఆ బాలుడుకి ఎందుకీ పదవి కట్టబెట్టారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అరుదైన క్యాన్సర్‌తో పోరాటం
అమెరికాకు చెందిన డీజే డేనియల్(DJ Daniel)కు ప్రస్తుతం 13 ఏళ్లు. చిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్(Cancer) బారిన పడ్డాడు. దీంతో అతడు 5 నెలలకు మించి బతకడని వైద్యులు కూడా చెప్పారు. దీంతో తీవ్రమైన దుఃఖంతోనే డేనియల్‌ను కాపాడుకునేందుకు అతడి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. గత ఆరేళ్లుగా అతడికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూనే.. అతడి కోరికలు తీరుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలు తిప్పుతూ బాలుడిని ప్రాణంగా చూసుకున్నారు. ఇటీవల అతడు ఆ అరుదైన క్యాన్సర్‌ను జయించడం విశేషం.
ట్రంప్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు
అయితే DJ డేనియల్ చిన్నప్పటి నుంచి పోలీస్(Police) కావాలని కలలు కన్నాడట. దేశానికి సేవ చేయాలని అనుకునేవాడట. ఈక్రమంలోనే డేనియల్ తండ్రి అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం చెప్పగా.. ఆయనే నేరుగా బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించారు. ట్రంప్ ఆదేశాలతో సీక్రట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్(Secret Service Director Sean Curran) వెంటనే అధికారిక బ్యాడ్జ్ అందజేశారు. ఆపై చిన్నారిని కౌగిలించుకున్నారు. దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
13-year-old DJ Daniel was sworn in to the Secret Service last night at the Joint Session.
President Trump invited him to the Oval Office today, where Special Agent Daniel gave the President a “big hug.” 🇺🇸 pic.twitter.com/IIfzYWkvaB
— The White House (@WhiteHouse) March 5, 2025