రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటిదాకా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించాడు. బాహుబలి సినిమా ఆయనను ప్రపంచ స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్, ప్రస్తుతం కల్కి 2898 ఎ.డి, “ది రాజాసాబ్”, “సలార్ పార్ట్ 2” లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
తాజాగా ప్రభాస్ తల్లికి అత్యంత ఇష్టమైన చిత్రం ఏంటి అనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ హీరోలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నా తమ తల్లిదండ్రుల ప్రశంసలే వారికి ఎంతో ప్రత్యేకం. తల్లిదండ్రులకు తమ కుమారుడు యావత్ దేశంలో గుర్తింపు పొందితే, ఆ గర్వం మాటల్లో చెప్పలేనిది. అయితే తాజాగా ప్రభాస్ తల్లి ఇచ్చిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇప్పటివరకు ప్రభాస్ తల్లి తన కుమారుని సినిమాల గురించి పబ్లిక్‌గా పెద్దగా మాట్లాడలేదు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఆమె… కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్‌లలో మాత్రం తన మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రభాస్ నటించిన సినిమాలన్నింటిలోకీ అత్యంత ఇష్టమైన చిత్రం మాత్రం “ఈశ్వర్” అని తెలిపింది.
2002లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌కి తొలిచిత్రం. అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అమాయకపు లుక్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, తాను ఎప్పుడూ “ఈశ్వర్” సినిమాను చాలా ఇష్టంగా చూసేదానినని, అదే తనకు ఫేవరెట్ మూవీ అని ఆమె స్వయంగా బయటపెట్టారట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అభిమానులు కూడా “ప్రభాస్ మదర్ చాయిస్ ఈశ్వర్” అంటూ పోస్ట్‌లు చేస్తూ ఈ స్టోరీని వైరల్ చేస్తున్నారు.






