వంటగ్యాస్ వినియోగదారుల(For Cooking gas users)కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఉజ్వల, సాధారణ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు నిన్న కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు సరఫరా కంపెనీలు రూ.50 చొప్పున పెంచడంతోనే తాము సిలిండర్ ధర పెంచాల్సి వచ్చింది మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీంతో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్(LPG Cylinder) ధర ఢిల్లీలో రూ.803 నుంచి రూ.853 వరకు పెరిగింది.
తెలుగు రాస్ట్రాల్లో ఇలా..
ఇక హైదరాబాద్(HYD)లో రూ.855 నుంచి రూ.905, వరంగల్(WGL)లో రూ.874 నుంచి రూ.924కి చేరింది. ఏపీలోని విజయవాడ (Vijayawada)లో రూ.825.50 నుంచి రూ.875.50కు చేరింది. కాగా ఈనెల 7వ తేదీలోపు సిలిండర్ల కోసం ఆన్లైన్లో చెల్లింపులు(Online Payments) చేసినా 8వ తేదీన డెలివరీ చేస్తే మిగతా రూ.50 కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ(TG)లో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) లబ్ధిదారులు మినహా మిగతా LPG గ్యాస్ వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది. అలాగే రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉజ్వల పథకం(Ujjwala Yojana) లబ్ధిదారులకూ పెంచిన ధర వర్తించనుంది.
#WATCH | Delhi | Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri says, “You would have seen a notification from the Ministry of Finance saying that the excise rates are going up by Rs 2 on petrol and diesel. Let me clarify upfront on the record, this will not be… pic.twitter.com/snSlkfEUFs
— ANI (@ANI) April 7, 2025






