మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) మరోసారి తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటకు హీరో నితిన్(Nithiin)తో కలిసి డ్యాన్స్ చేశారు. కాగా ఈనెల 28న ‘రాబిన్‌హుడ్’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అందరి చూపు అతడిపైనే..
కాగా వెంకీ కుడుముల(Venky Kudumula) తెరకెక్కించిన ఈ మూవీలో నితిన్(Nithin)కి జోడీగా అందాల భామ శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘అదిదా సర్ ప్రైజ్ (Adhi Dha Surprisu)’ అనే స్పెషల్ సాంగ్‌తో ఈ భామ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో వార్నర్ యాక్టింగ్ స్కిల్స్‌ను చూసేందుకు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






