
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే మొత్తం 18 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 12 శాఖలకే మంత్రులున్నారు. కీలకమైన హోమ్, విద్యాశాఖలను సీఎం రేవంత్(Revanth Reddy) తన వద్దే పెట్టుకున్నారు. దీంతో తాజాగా రేవంత్ ఢిల్లీ(Delhi) పర్యటనతోనైనా క్యాబినేట్(Cabinate) విస్తరణ ఉంటుందని పార్టీలోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అటు త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖలకు మంత్రులను కేటాయించాలని అధిష్ఠానం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ ముగ్గురు మంత్రుల పనితీరుపై సీఎం సర్వే
ఇదిలా ఉండగా గత ఏడాది పాలనపై సీఎం రేవంత్ ఇటీవల సర్వే(Survey) నిర్వహించారు. అందులో ముగ్గురు మంత్రుల(Ministers)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఢిల్లీలో మంత్రుల పనితీరు నివేదికను AICC కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా అధిష్ఠానానికి అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకురావడంలో ముగ్గురు మంత్రుల పాత్ర ఉందని రేవంత్ అసంతృప్తిగా ఉన్నారట. వీరిని మంత్రి వర్గంనుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ పార్టీ పెద్దలను కోరగా అధిష్ఠానం ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే..
సీఎం రేవంత్ నివేదిక(Report of CM Revanth) ప్రకారం ముగ్గురు మంత్రులు తమ శాఖలపై పట్టుసాధించలేకపోయారని తెలుస్తోంది. వారి వ్యవహార శైలితో వివాదాలు మరింత తీవ్రంగా మారాయి. వారిలో కొండా సురేఖ(Konda Surekha), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), తుమ్మల నాగేశ్వరరావుల(Thummala Nageswara Rao) పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దురుసైన వ్యవహార శైలి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇటీవల సినీనటులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానూ మారాయి. పైగా వరంగల్(Warangal) జిల్లా పార్టీలో అంతర్గత పోరుకు ఆమె కారణమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సమన్వయం.. సత్సబంధాలు లేకపోవడమే కారణమా?
ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మంత్రిపదవి పొందినప్పటికీ, తన శాఖను సమర్థంగా నిర్వహించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో MLAలతో ఆయనకు సమన్వయం లేదు. యూబీ గ్రూప్ సంబంధిత సమస్యలను సరిగా పరిష్కరించలేదన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇక అనుభవజ్ఞుడైన తుమ్మల నాగేశ్వర్‌రావు(Thummala Nageswara Rao) కీలక నేతే అయినప్పటికీ, ప్రస్తుతం తన శాఖపై పట్టు సాధించలేకపోయారని టాక్ నడుస్తోంది. ఖమ్మం(Khammam) జిల్లాలో ఇతర నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేకపోవడం, ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు రావడం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారాయని వినికిడి. ఏది ఏమైనా త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెనుమార్పులు ఖాయంగా కనిపిస్తోంది.