అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై రికార్డులు కొల్లగొడుతోంది. పుష్ప 2 ది రూల్ రిలీజైన అన్ని సెంటర్లలో దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.
ఇప్పటికే ఓపెనింగ్ డే రోజు నైజాం ఏరియాలో పుష్ఫ 2 కు రూ.30 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ (rrr) (రూ.23.38 కోట్లు)పై ఉన్న రికార్డును అధిగమించినట్టు ఫిల్మ్ వర్గాల టాక్. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకుందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (sharuk khan) మూవీ జవాన్ ఫస్ట్ డే రూ.65 కోట్లు వసూళ్లు రాబట్టగా.. పుష్ప 2 రూ.67 కోట్లతో రికార్డ్‌ను బీట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచినట్లు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డుల మోత ఖాయమని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జాతర ఎపిసోడ్ ఫుల్ క్రేజ్
మైత్రీ మూవీ మేకర్స్ ( maitri movie makers) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సీక్వెల్‌లో ఫహద్ ఫాజిల్, జగీశ్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కు ఫుల్ క్రేజ్ టాక్ వినిపిస్తోంది. సినిమాకు ఈ జాతర సీన్ చాలా హైలైట్ గా నిలుస్తోందని అంటున్నారు.
బెనిఫిట్ షోలు రద్దు?
కాగా పుష్ఫ 2 సినిమాకు సంబంధించి తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (komati reddy venkat reddy) ఇకపై బెనిఫిట్ షోలను రద్దు చేయనున్నామని ప్రకటించారు. దీంతో రాబోయే రోజుల్లో సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఇది పెద్ద దెబ్బగా మారనుంది. మెగా, అల్లు అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గానీ ప్రచారంలో గానీ ఎక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు పాల్గొనలేదు. తాజాగా సినీ నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ మెగా స్టార్ చిరంజీవిని ( chiranjeevi) కలిసి సినిమా చూడాలని కోరడం సంచలనంగా మారింది. చిరంజీవి సినిమా చూస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.






