
బంగారం ధరలు(Gold Rates) నిన్న హిస్టరీ క్రియేట్ చేశాయి. లైవ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు పైగా పలికింది. దీంతో బంగారు ఆభరణాలు(Gold Jewellery) కొనుగోలు చేసేవారు షాకయ్యారు. దీంతో నిన్న ఒక్కరోజే నింగిని తాకిన ధరలు ఈరోజు (ఏప్రిల్ 23) శాంతించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో(International Market) బంగారం ధరలు క్రితం రోజుతో పోలిస్తే భారీగా దిగివచ్చాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3151 డాలర్లపైన ఉండగా అది ఇవాళ 3112 డాలర్ల కిందకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు(Silver Price) ఔన్సుకు 31.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
10 గ్రాముల బంగారంపై రూ.3 వేలు తగ్గింది
ఇక ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది. అటు స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఇవాళ కూడా లాభాల్లో మొదలయ్యాయి. Sensex 487 పాయింట్లు పుంజుకొని 80,086 వద్ద ట్రేడవుతోంది. Nifty 139 పాయింట్లు ఎగబాకి 24,306 దగ్గర కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి మారకం విలువ(Rupee Value) రూ.85.403 డాలర్లుగా ఉంది.