
దేశంలో స్కూల్విద్యకు (school education) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని(No-detention policy) రద్దు చేసింది.ఈ నిర్ణయంతో ఇకపై ఫైనల్ఎగ్జామ్లో పాస్‌కాని 5, 8 తరగతుల (5, 8 classes) విద్యార్థులు మళ్లీ అదే క్లాసుల్లో చదవాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది.
మళ్లీ పరీక్ష రాసేందుకు ఛాన్స్
వార్షిక పరీక్షల్లో స్టూడెంట్లు హైక్లాసులకు ప్రమోట్ కావడంలో ఫెయిలైతే మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇవ్వనున్నారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కూడా ఒకవేళ ఫెయిలైతే.. ఆ స్టూడెంట్లు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం
2019 మార్చిలో విద్యాహక్కు చట్టంలో చేసిన సవరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు (No-detention policy for 5, 8 classes) తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. స్కూల్ విద్య రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని అధికారి చెప్పారు.