గత పదేళ్ల సంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR Tweet

భోగి, సంక్రాంతి(Bhogi, Sankranti) పండుగలను పురస్కరించుకొని తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత KCR ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతన్న(Farmers) జీవితాల్లో వెలుగులు కొనసాగాలని, పండిన పంటలతో అన్నదాతల ఇళ్లు కళకళలాడాలని ఆకాంక్షించారు. నూతన తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వ్యవసాయం(Agriculture) పండుగ కావాలని, పాటి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు అందించినట్లు KCR చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత BRS ప్రభుత్వానిదే ఆయన ట్వీట్(Tweet) చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాం..

వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా BRS ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం(Financial Support) సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని కేసీఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢసంకల్పంతో ముందుకు సాగామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతికాలంలో సత్ఫలితాలనిచ్చిందని వివరించారు. అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు(Free Current), ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు(Rythu Bandhu), రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా(Rythu Bhima) వంటి పథకాలను పటిష్ఠంగా అమలు చేశామని తెలిపారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *