
గతవారం వరకూ ఎడతెరిపి లేని వర్షాలు(Rains) హైదరాబాద్(Hyderabad) వాసులను అతలాకుతలం చేశాయి. కనీసం బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు వరుణుడు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజులుగా ఎండలు కొడుతున్నాయి. కానీ నిన్న (ఆగస్టు 4) సాయంత్రం భారీ వర్షంతో మరోసారి మహానగర వాసుల్లో అలజడి సృష్టించింది. భారీ వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఇక ఈరోజు (ఆగస్టు 5) సాయంత్రం వరకూ ఎండ దంచి కొట్టినా ఆ తర్వాత మేఘాలు కమ్ముకున్నాయి. అదే పనిగా వర్షం మొదలైంది. దీంతో మంగళవారం సాయంత్రం నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొట్టింది.
ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇక వరుణుడి దెబ్బకు రహదారులన్నీ(Roads) జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్(Heavy Traffic)కు అంతరాయం కలిగింది. GHMC, HYDRA సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
Cumulonimbus clouds observed over North/NW GHMC areas. Moderate to heavy rain likely this evening and night in Medchal & Hyderabad districts; Rangareddy district may see moderate showers. pic.twitter.com/PazpQHYaPr
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 5, 2025