
రాజధాని అమరావతి నిర్మాణాని(Capital Amaravathi construction)కి 34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నమస్కారాలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మాట్లాడిన పవన్ రైతుల(Farmers)పై ప్రశంసలు కురిపించారు. అమరావతి రైతులు 5 సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మరోసారి మోదీ(PM Modi) చేతుల మీదుగా రాజధాని నిర్మాణం పున ప్రారంభం జరుగుతుందన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఈ రాజధాని ఒక హబ్(Hub) లాంటిదని, ఓ ఇల్లు లాంటిదన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ పవన్‌ను పిలిచి చాక్లెట్(Chocolate) ఇచ్చారు. దీంతో వేదికపై నవ్వులు పూశాయి.
PM @narendramodi gave a chocolate to Pawan Kalyan 😀
Naysayers will start a new controversy… pic.twitter.com/6tBq9rKqg4— Truth Unplugged (@Truth_Unplugged) May 2, 2025
20 ఏళ్ల ముందే భవిష్యత్‌ను ఊహించిన నేత
రైతులు పడ్డ బాధలను గుర్తు చేసిన డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ నాటి రోజులను గుర్తు చేశారు. “రాజధాని నిర్మాణానికి భూములు(Land For Capital) ఇచ్చిన రైతులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ఐదేళ్లలో మీరు పడ్డ బాధలు, మీరు తిన్న లాఠీ దెబ్బలు, మీరు అనుభవించిన అవస్థలు అన్ని మా మనసులో ఉన్నాయి. దివ్యాంగులను కూడా లాఠీతో కొట్టడం, నా గుండెల్లో ఇప్పటివరకు ఇలాగే ఉంది. ఆ బాధను నేను మర్చిపోలేను. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది.. 20 ఏళ్ల ముందే భవిష్యత్‌ను ఊహించి ప్రణాళికతో ముందుకు వెళ్ల గల నేత సీఎం చంద్రబాబు(CM Chandrababu)’’ అని పవన్ తెలిపారు.
రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం – Deputy CM Pawan Kalyan pic.twitter.com/OUPE4hgoU4
— idlebrain.com (@idlebraindotcom) May 2, 2025
రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు: మంత్రి లోకేశ్
ఇక మంత్రి లోకేశ్(Lokesh) మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని (Unstoppable) లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలయాపన చేశారే తప్ప, రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్(Double engine Sarkar) ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని అన్నారు.
TDP Minister Nara Lokesh-
“We have a powerful weapon called Narendra Modi to defeat Pakistanis.
Don’t provoke a lion.
With a single strike from Modi, Pakistan will vanish from the world map.” pic.twitter.com/2AyGqyFBhn
— News Arena India (@NewsArenaIndia) May 2, 2025