PM Modi: నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి మరో దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం(Highest civilian award) దక్కింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియా(Namibia)కు వెళ్లిన మోదీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఏన్షియంట్‌ వెల్‌విట్షియా మిరాబిలిస్‌(Order of the Most Ancient Welwitschia Mirabilis)’ను అందుకున్నారు. ఈ మేరకు నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా(Netumbo Nandi-Ndaitwah) ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ నేతగా PM మోదీ నిలవడం గమనార్హం. ఈ పురస్కారంతో 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీకి 27వ అంతర్జాతీయ పురస్కారాలు(International awards) అందుకోవడం విశేషం.

Image

నమీబియాలో పర్యటించిన 3వ భారత ప్రధానిగా మోదీ

కాగా PM హోదాలో మోదీ నమీబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆరోగ్య సంరక్షణ(Health), ఇంధనం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా, నమీబియాలో పర్యటించిన మూడో భారత ప్రధానిగా మోదీ నిలిచారు.

భారత్‌కు పయనమైన మోదీ

ఈ నెల 2న ప్రారంభమైన ప్రధాని ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఘనా(Ghana), ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలను సందర్శించారు. బ్రెజిల్‌లోని రియోలో జరిగిన బ్రిక్స్ సదస్సు(BRICS conference)లోనూ పాల్గొన్నారు. ఈ పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం విశేషం. ఇక ఐదు దేశాల పర్యటన ముగించుకొని మోదీ భారత్‌కు పయనమయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *